గురువారం, ఆగస్టు 06, 2020

తాజా వార్తలు

తిరుపతిలో మధ్యాహ్నం వరకే దుకాణాలు

సమావేశమైన తిరుపతి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తమవంతు బాధ్యతగా సోమవారం నుంచి తిరుపతిలో మందుల దుకాణాలు తప్ప ఇతర అన్ని దుకాణాలను మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేస్తున్నట్లు తిరుపతి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది. ఆ సంస్థ కార్యాలయంలో అధ్యక్షులు మంజునాథ్‌ అధ్యక్షతన నగరంలోని వివిధ ట్రేడ్స్‌ వ్యాపారులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించి దుకాణాల మూసివేత నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో సంస్థ కార్యదర్శి మధుసూదన్‌రావు, రాయల్‌ చెరువు ట్రేడర్స్‌ అసోసియేషన్‌, శానిటరీ అండ్‌ టైల్స్‌ ట్రేడర్స్‌, బులియన్‌, సిల్వర్‌ మర్చంట్‌ అసోసియేషన్స్‌, ఫుడ్‌ గ్రెయిన్స్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌, ఫుట్‌వేర్‌ అసోసియేషన్‌, నేతాజీ రోడ్డు ట్రేడర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని