తాజా వార్తలు

Published : 19/06/2021 06:23 IST
జులై 8 నాటికి ఆర్బీకే భవనాలు సిద్ధం

వీసీ నిర్వహిస్తున్న కలెక్టర్‌ నివాస్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా జులై 8న రైతు భరోసా కేంద్ర (ఆర్బీకే) భవనాలను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్న దృష్ట్యా, జిల్లాలో సదరు భవనాలను ఆ రోజు కల్లా ప్రారంభించేలా సిద్ధం చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) ద్వారా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్షించారు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్‌.ఆర్‌. హెల్త్‌ క్లినిక్‌ల భవనాలను జులై 31 నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రతి డీఈఈ ప్రతి మండలంలో వారంలో ఆరు భవనాలకు శ్లాబులను పూర్తి చేసే లక్ష్యంగా పని చేయాలన్నారు. సచివాలయాల భవనాలు ఇప్పటికే 209 పూర్తి చేశారని, జులై 31 నాటికి మరో 325 భవనాలను పూర్తి చేయాలన్నారు. పలు మండలాల్లో భవనాల పనుల ప్రారంభానికి భూ సమస్యలు పెండింగులో ఉన్నట్టు పేర్కొన్నారు. జేసీ (రెవెన్యూ) వీటిపై తహసీల్దార్లతో సమీక్షించి వారంలోగా పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో జేసీ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్‌, శిక్షణ కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక, పీఆర్‌ ఎస్‌ఈ ప్రకాష్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తొలుత జాబ్‌ క్యాలెండర్‌ విడుదలపై సీఎం జగన్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో విడిది కార్యాలయం నుంచి కలెక్టర్‌ పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని