తాజా వార్తలు

Published : 19/06/2021 06:23 IST
రూ.2.50 కోట్లతో 5 ఆక్సిజన్‌ ప్లాంట్లు

సమీక్షిస్తున్న జేసీ శివశంకర్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని 5 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీల్లో) రూ.2.5 కోట్లతో ఆక్సిజన్‌ ప్లాంట్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని జేసీ (అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. నగరంలోని తమ విడిది కార్యాలయంలో పరిశ్రమలు, సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, అవనిగడ్డ సీహెచ్‌సీల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఒక్కో ప్లాంటుకు రూ.50 లక్షల మేర ఖర్చవుతుందన్నారు. సీఎస్‌ఆర్‌ నిధుల కింద రామ్‌కో, అల్ట్రా టెక్‌ వంటి పలు పరిశ్రమలు ఇప్పటికే ప్రభుత్వంతో ప్లాంట్ల నిర్మాణానికి అంగీకరించినట్టు వివరించారు. సమీక్షలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌, ఏపీఎంస్‌ఎస్‌ఐడీసీ ఈఈ ప్రవీణ్‌రాజ్‌, పరిశ్రమల ప్రోత్సాహక అధికారులు కిశోర్‌, శివరామప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని