తాజా వార్తలు

Published : 19/06/2021 06:23 IST
పోలీసుల అదుపులో ‘రియల్‌’ నిందితుడు?

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: పలువురు నుంచి రూ.కోట్లు కొల్లగొట్టి పరారైన ‘రియల్‌’ నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. విజయవాడ మహానాడు రోడ్డులోని ఎంకే కనస్ట్రక్షన్‌ అండ్‌ డెవలపర్స్‌ నిర్వాహకులు ఖాతాదారుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి భూములు రిజిస్ట్రేషన్‌ చేయకుండా మోసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా, సంస్థ నిర్వాహకులు పట్నాల శ్రీనివాసరావు, ఉప్పు మనోజ్‌ కుమార్‌, బలగం రవితేజలపై పటమట స్టేషన్‌లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి పోలీసులు రెండు బృందాలను నియమించారు. ఒక బృందం విశాఖపట్నం వెళ్లగా, మరొక బృందం హైదరాబాద్‌లో గాలిస్తున్నారు. ముగ్గురిలో ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎవరెవరి వద్ద ఎంతెంత డబ్బులు కట్టించుకున్నారో ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని