తాజా వార్తలు

Published : 19/06/2021 06:23 IST
నైపుణ్య కోర్సును సద్వినియోగం చేసుకోండి : జేసీ

మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) మోహన్‌కుమార్‌

మాచవరం, న్యూస్‌టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ద్వారా నిర్వహిస్తున్న జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌ (జీడీఏ) కోర్సును జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమ) మోహన్‌కుమార్‌ సూచించారు. నగరంలోని లర్నెట్‌ స్కిల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రాంగణంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై కోర్సును ప్రారంభించారు. అర్హులైన అభ్యర్థులు 21 రోజుల శిక్షణకు హాజరై జిల్లాలోని పీహెచ్‌సీలు/సీహెచ్‌సీల్లో మూడు నెలల పాటు ఆచరణాత్మక శిక్షణ పూర్తి చేసుకుంటారన్నారు. మూడు నెలల శిక్షణ పొందినవారు కొవిడ్‌ పోరాటంలో అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా వైద్యాధికారిణి సుహాసిని, పలువురు ప్రభుత్వ వైద్యాధికారులు, ప్రైవేటు వైద్యులు, పలువురు నర్సులు హాజరుకాగా.. కార్యక్రమ నిర్వహణలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈడీ విజయ మోహన్‌, సీనియర్‌ మేనేజర్‌ ఎంబీకే రాజు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పి.ప్రణయ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని