తాజా వార్తలు

Published : 19/06/2021 06:23 IST
ఐడియా ల్యాబ్స్‌తో నూతన సాంకేతిక విప్లవం

మాట్లాడుతున్న మల్లికార్జునరావు, చిత్రంలోసుబ్బారావు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: నూతన సాంకేతిక విప్లవానికి నాంది పలికేందుకు.., విద్యార్థులు, ఉపాధ్యాయుల మదిలో మెదిలిన ఆలోచనల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ఐడియా ల్యాబ్‌లకు శ్రీకారం చుట్టిందని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యక్షులు మల్లికార్జునరావు అన్నారు. కొత్తపేటలోని కళాశాలలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష మేరకు దేశంలో 204 కళాశాలలు ఈ ఐడియా ప్రయోగశాలల ఏర్పాటు కోసం పోటీ పడగా, అందులో 49 కళాశాలలకు ఏఐసీటీఈ నుంచి అనుమతి లభించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని 5 కళాశాలు అర్హత పొందగా అందులో పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్‌ కళాశాల ఒకటి అని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ప్రయోగశాలను ఉపయోగించుకోవచ్చని వివరించారు. దీని ఏర్పాటుకు రూ.1.10 కోట్ల వ్యయం అవుతుందని, 2 ఏళ్లలో అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. కళాశాల కార్యదర్శి రావూరి సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టి మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఈ ల్యాబ్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ రామకృష్ణ మాట్లాడుతూ స్టార్‌ బిల్డింగ్స్‌, స్టార్‌ సిటీస్‌ అనే అంశాలకు సంబంధించి ‘ఆలోచనతో అడుగిడు-నమూనాతో కనపడు’ అనే నినాదంతో వీటిని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కమిటీ కోశాధికారి కొత్తమాసు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని