తాజా వార్తలు

Published : 19/06/2021 06:01 IST
పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా దాదాపు 30 మంది వరకు జీజీహెచ్‌లో చేరారు. ఇప్పటివరకు మొత్తం 443 మంది బాధితులు దీని బారిన పడ్డారు. వీరిలో 228 మందికి శస్త్రచికిత్స నిర్వహించి డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం 201 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 135 మందికి ఆపరేషన్‌ నిర్వహించి, పరిశీలనలో ఉంచారు. మిగిలిన వారికి కూడా ఆపరేషన్‌ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 14 మంది బ్లాక్‌ ఫంగస్‌ సోకి మృతి చెందారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఒక్కటే మిషన్‌ ఉండడంతో శస్త్రచికిత్సలకు ఆలస్యం అవుతోంది. కొత్త యంత్రం వచ్చే వారంలో వస్తుందని అధికారులు తెలిపారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని