తాజా వార్తలు

Published : 19/06/2021 06:01 IST
అవి సర్కారు హత్యలే..

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ సోకి ఆసుపత్రుల్లో చేరిన వారికి ఆక్సిజన్‌ అందించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని, ప్రాణ వాయువు అందక మరణించిన వారి విషయంలో వాటిని సర్కారు హత్యలుగానే పరిగణించాలని తెదేపా విజయవాడ లోక్‌ సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌ ఆరోపించారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని, తెల్ల రేషను కార్డు కలిగిన కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం చేయాలని, ఆక్సిజన్‌ కొరతతో మరణించిన వారికి రూ.25 లక్షల మేర పరిహారం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ.. కరోనా మరణాలు, తదితరాల్లో ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందన్నారు. కాకి లెక్కలు అనే సామెత పోయి.. రానున్న రోజుల్లో ‘ఏపీలో కరోనా లెక్కలు’ అనే సామెత వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రీరాంరాజగోపాల్‌, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, విజయవాడ లోక్‌ సభ మహిళా విభాగ అధ్యక్షురాలు ఉషారాణి పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని