తాజా వార్తలు

Published : 19/06/2021 06:01 IST
కరోనా బాధితులను ఆదుకోవాలి

కొవిడ్‌ సాయం, ఉపాధి వైఫల్యాలపై తెదేపా ఆందోళన


తమ డిమాండ్ల పత్రాలను చూపిస్తున్న దేవినేని ఉమా, నెట్టెం రఘురామ్‌, గద్దె రామ్మోహన్‌, అశోక్‌బాబు తదితరులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు సాయం అందించాలని, పనులు లేక ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాలని తెదేపా నాయకులు కోరారు. పార్టీ పిలుపు మేరకు విజయవాడలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్‌ఛార్జి ఆర్డీవో కె.రాజ్యలక్ష్మికి సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులు కరోనా పరిస్థితులపై క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తుంటే, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం తాడేపల్లి రాజప్రాసాదంలో చేతులు కట్టుకు కూర్చొని చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కరోనా వల్ల ఎంత మంది చనిపోయారో సరైన లెక్క చెప్పకుండా.. ఆస్పత్రులపై ఒత్తిడి తెచ్చి గుండెపోటు ఇతర కారణాల వల్ల మరణించారంటూ తప్పు దారి పట్టించి, బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయం అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రన్న బీమా రద్దు చేయకుంటే నేడు కరోనా బాధితులకు రూ.10 లక్షల మేర సాయం అందేదన్నారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి జిల్లాలోనే ఉన్నా పాత్రికేయులకు కనీసం అక్రిడిటేషన్లను కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని