తాజా వార్తలు

Updated : 14/06/2021 18:28 IST
AP news: గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

అమరావతి: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లు ఆమోదంపై చర్చిస్తున్నట్లు సమాచారం. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్‌రాజు, రమేశ్‌ యాదవ్‌ పేర్లను ప్రభుత్వం గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లింది. అభ్యర్థుల ఎంపిక విధానం, ప్రాధాన్యత అంశాలను గవర్నర్‌కు సీఎం వివరించనున్నారు. నామినేటెడ్‌ పదవుల భర్తీపైనా చర్చించనున్నట్లు సమాచారం. 80 కార్పొరేషన్లు, 960 డైరెక్టర్ల పదవుల భర్తీకి సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.దీనిపై గవర్నర్‌ సూచనలను సీఎం తీసుకోనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపైనా గవర్నర్‌తో చర్చించనున్నారు.


ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని