తాజా వార్తలు

Published : 14/06/2021 15:30 IST
MansasTrust: హైకోర్టు తీర్పు హర్షణీయం: చంద్రబాబు

అమరావతి: మాన్సాస్‌ ట్రస్టు కేసులో హైకోర్టు తీర్పు హర్షణీయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కోర్టు తీర్పు వేలమంది ఉద్యోగులకు అండగా నిలిచిందన్నారు. అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదని ఆయన వ్యాఖ్యానించారు. ట్రస్టును కాపాడుకున్న అశోక్‌ గజపతిరాజుకు అభినందనలు తెలిపారు. మాన్సాస్‌ ట్రస్టు కేసులో న్యాయమే గెలిచిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చీకటి జీవోలు ఇచ్చిన జగన్‌ సర్కారుకు హైకోర్టు తీర్పు గుణపాఠమని చెప్పారు.న్యాయపోరాటం చేసిన అశోక్‌గజపతి రాజుకు అభినందనలు తెలిపారు.మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను ఏపీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ర‌ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా పునర్నియమించాలని ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. సంచ‌యిత నియామక జీవోను సవాల్ చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఉన్నత న్యాయస్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు తీర్పు వెలువ‌రించింది.

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని