తాజా వార్తలు

Updated : 14/06/2021 18:55 IST
Raghurama: ‘కౌంటర్‌లో జగన్‌ అసత్య ఆరోపణలు’

రిజాయిండర్‌లో పేర్కొన్న ఎంపీ రఘురామ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. జగన్‌ కౌంటర్‌పై రఘురామ రిజాయిండర్‌ దాఖలు చేశారు. రిజాయిండర్‌లో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.

‘‘కౌంటర్‌లో జగన్‌ అసత్య ఆరోపణలు చేశారు. నాకు పిటిషన్‌ వేసే అర్హత లేదనడం అసంబద్ధం. పిటిషన్‌ విచారణార్హతపై ఇప్పటికే కోర్టులు స్పష్టత ఇచ్చాయి. నాపై కేవలం ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.. ఛార్జ్‌షీట్‌లు కాలేదు. జగన్‌ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. పిటిషన్‌పై విచారణకు.. నా కేసులకు సంబంధం లేదు. నాపై అనర్హత వేటుకు.. ఈ పిటిషన్‌కు సంబంధం లేదు. సీబీఐలోని కొందరు వ్యక్తులు కేసును ప్రభావితం చేస్తున్నారు. అందుకే సీబీఐ ఎలాంటి వైఖరి వెల్లడించలేదు. ప్రచారం కోసమే పిటిషన్‌ వేశానన్న ఆరోపణలు నిరాధారం. నేను పిటిషన్‌ వేయగానే సీఐడీ నాపై కేసు నమోదు చేసింది. చట్ట విరుద్ధంగా నన్ను అరెస్ట్‌ చేసి వేధించారు’’ అని పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం జులై 1కి వాయిదా వేసింది.

ఓంబిర్లాతో భేటీ

లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ అయ్యారు. ప్రివిలేజ్‌ కమిటీ ద్వారా విచారణ త్వరగా చేపట్టాలని కోరారు. తనపై దాడి చేసిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా వెబ్‌సైట్‌లో తన పేరును తొలగించడాన్ని స్పీకర్‌ వద్ద ఆయన ప్రస్తావించారు.

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని