తాజా వార్తలు

Published : 14/06/2021 04:23 IST
నెల రోజుల వ్యవధిలో దంపతులు మృతి

ముప్పాళ్ల రమేశ్‌ దంపతులు (పాతచిత్రం)

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు నాలుగో సోదరుడు ముప్పాళ్ల రమేశ్‌(55) కొవిడ్‌తో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మృతి చెందినట్లు సీపీఐ జిల్లా కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రమేశ్‌ సతీమణి పుష్పరాణి 36 రోజుల కిందట కొవిడ్‌తో మరణించారు. కొద్ది రోజుల క్రితం ఆయనకూ కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూ ఆయన కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వారి మృతి పట్ల సీపీఐ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ముప్పాళ్ల రమేశ్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని