తాజా వార్తలు

Published : 14/06/2021 04:23 IST
‘దేవుడ్ని ప్రార్థిస్తే దేశం బాగుంటుంది’

పూజలో పాల్గొన్న జస్టిస్‌ అంజయ్య

ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: దేవుడ్ని ప్రార్థిస్తే దేశం బాగుంటుందని నరసరావుపేట రెండో కోర్టు అదనపు న్యాయమూర్తి అంజయ్య అన్నారు. వేములూరిపాడులోని చౌడేశ్వరీ అమ్మవారిని, అమీనాబాద్‌ కొండపై ఉన్న మూలాంకరేశ్వరీ దేవిని న్యాయమూర్తి ఆదివారం దర్శించుకున్నారు. మేళ తాళాలు, పూర్ణకుంభంతో న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌ రామకోటేశ్వరావు, బత్తుల కుమారస్వామి న్యాయమూర్తిని సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. ఆలయ అధికారి వెంకటరామిరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని