తాజా వార్తలు

Published : 14/06/2021 04:14 IST
నూజివీడు డివిజన్‌లో 56 కొవిడ్‌ మరణాలు

నూజివీడు, న్యూస్‌టుడే: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో నూజివీడు డివిజన్‌లో ఆదివారం నాటికి అధికారికంగా 56 కొవిడ్‌ మరణాలు సంభవించినట్లు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ డి.ఆశ తెలిపారు. మట్టి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం రూ.15,000 చొప్పున మృతుల కుటుంబ సభ్యులకు అందించడానికి చర్యలు తీసుకుందని ఆమె చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మృతుల నామినీల బ్యాంకు ఖాతాల నంబర్లు సేకరించి ఉన్నతాధికారులకు పంపామన్నారు. త్వరలో ఖాతాలకు సొమ్ము జమ అయ్యే అవకాశం ఉందని ఆశా పేర్కొన్నారు. ఎ.కొండూరు మండలంలో 2, ఆగిరిపల్లి 5, బాపులపాడు 9, చాట్రాయి 1, ఉయ్యూరు 3, నూజివీడు రూరల్‌ 2, ఉంగుటూరు 7, గన్నవరం 16, ముసునూరు 2, రెడ్డిగూడెం 5, విస్సన్నపేట 2, పమిడిముక్కల 1, తిరువూరు మండలంలో ఒక మృతి నమోదైనట్లు ఆమె తెలిపారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని