తాజా వార్తలు

Published : 14/06/2021 04:14 IST
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

పెనమలూరు, న్యూస్‌టుడే:  వరంగల్‌ జిల్లాకు చెందిన కుసుమ ప్రశాంత్‌(26) అనే యువకుడు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రశాంత్‌ వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం మాలోజిపేట గ్రామ నివాసి. అతడు గత నాలుగేళ్లగా కానూరు కొత్త ఆటోనగర్‌లోని అమరావతి లైవ్‌ సైన్స్‌ అనే సంస్థ గోదాములో ఇన్‌ఛార్జిగా   పనిచేస్తున్నాడు. స్థానికంగా ఇతను ఓ గదిలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్‌లో నివసించే అతని యజమాని నందకిషోర్‌ ఆదివారం ఉదయం ప్రశాంత్‌కు ఫోన్‌ చేస్తున్నా స్పందించకపోవడంతో అదే గోదాములో పనిచేసే ఎల్లయ్యను ఆ యువకుడి వద్దకు పంపారు. ఎల్లయ్య అక్కడకు వెళ్లి చూడగా ప్రశాంత్‌ నివసించే గది తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా అప్పటికే ప్రశాంత్‌ నోట్లోంచి నురగలు బయటకు వచ్చి చనిపోయి కన్పించాడు. ఎల్లయ్య వెంటనే తన యజమానితో పాటు ప్రశాంత్‌ కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించాడు. పెనమలూరు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక గుండెపోటుతో మరణించాడా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని