తాజా వార్తలు

Published : 14/06/2021 04:14 IST
విద్యా సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి

ఎమ్మెల్సీ కల్పలతకు వినతిపత్రం అందజేస్తున్న సతీష్‌, రెడ్డెమ్మ, హరిశరణ్‌

తాడేపల్లి, న్యూస్‌టుడే:  ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థులు అభ్యాసన ఫలితాలు సాధించాలంటే మార్గదర్శక వ్యవస్థను పటిష్టపరచాలని కోరుతూ వికాసం రాష్ట్ర అధ్యక్షుడు సరికొండ సతీష్‌, అమరావతి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొనకళ్ల రెడ్డెమ్మ సంయుక్తంగా ఎమ్మెల్సీ కల్పలతకు ఆదివారం తాడేపల్లిలోని ఆమె నివాసంలో వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులకు ఇతర బాధ్యతలు అప్పగించకుండా చూడాలని కోరారు. మండల విద్యాశాఖాధికారి పోస్టుకు సమాంతరంగా మండల విద్యాగైడెన్స్‌కు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో 11, 12 తరగతులు ఏర్పాటు చేయాలని, డీఎస్సీ నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థుల ద్వారా ఖాళీలను భర్తీ చేయాలన్నారు. వికాసం కృష్ణా జిల్లా    అధ్యక్షుడు హరిశరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని