తాజా వార్తలు

Published : 14/06/2021 04:14 IST
శ్రీకాకుళేశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

స్వామివారిని దర్శించుకుంటున్న జస్టిస్‌ ఉమాదేవి

శ్రీకాకుళం (ఘంటసాల), న్యూస్‌టుడే : ఘంటసాల మండలం శ్రీకాకుళంలో కొలువైన శ్రీకాకుళేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అర్చకుడు భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. ఆలయ చరిత్రను తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. ముందుగా జస్టిస్‌ ఉమాదేవికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మొవ్వ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.రమ్య, ఆలయ ఈఓ లీలాకుమార్‌, సీఐ శ్రీనివాసరావు, డీటీ మల్లేశ్వరరావు, ఆలయ సహాయ అధికారులు అర్జునరావు, రమణ, ఆర్‌ఐ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని