తాజా వార్తలు

Published : 14/06/2021 04:14 IST
అటు కళకళ.. ఇటు వెలవెల

రాజధాని అమరావతిలో వివిధ రహదారుల అనుసంధానతలో ఎంతో కీలకమైంది సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు. ఎనిమిది వరుసలతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో దీని నిర్మాణం చేపట్టారు. ఇందుకు రూ.248 కోట్లు వెచ్చించారు. రెండేళ్ల నుంచి ఈ పనులు ఆగిపోయాయి. రోడ్డు సుందరీకరణ పనులకు నిధుల కొరత వేధిస్తోంది. డివైడర్‌ మధ్యలో పచ్చదనం అభివృద్ధికి ఇది ఆటంకంగా మారింది. దీని నిర్వహణ బాధ్యతలను ఏడీసీ (అమరావతి అభివృద్ధి సంస్థ)లోని గ్రీనరీ విభాగô పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం వెంకటపాలెం కూడలి నుంచి ఎన్‌6 వరకు ఉన్న రెండు కిలోమీటర్ల మేర వివిధ పూల మొక్కలు, లాన్‌ను వేశారు. ఏడీసీ నర్సరీలో ఉన్న కొద్దిపాటి మొక్కలను తెచ్చి నాటారు. దీంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో కొంత భాగం పచ్చదనంతో కనువిందు చేస్తుండగా, మిగిలిన భాగం పచ్చిక లేక ఎడారిని తలపిస్తోంది.

-ఈనాడు, అమరావతి

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని