తాజా వార్తలు

Published : 08/04/2021 03:16 IST
ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలి

మాట్లాడుతున్న ఆర్‌.నారాయణమూర్తి

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: ఎంతో ప్రతిభావంతుడైన విఖ్యాత నటుడు, తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి కోరారు. ఆయన బుధవారం స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కార ప్రదానోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి పేరును 14 సార్లు పద్మశ్రీ పురస్కారం కోసం పంపించినా కేంద్రం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. దర్శకుడు బాపు, గాయకులు డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సుశీల, జానకి వంటి వారు అత్యున్నత పురస్కారాలకు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పురస్కారాల ఎంపిక తీరును తప్పుబట్టారు. మెడికల్‌ మాఫియా కరోనా బూచీని చూపి జనాన్ని మరింతగా భయపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశాలను ఆయన వ్యతిరేకించారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని