గురుముఖం

Updated : 25/05/2021 21:00 IST
తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం ప్రభావం ఉంటుందా? 

హైదరాబాద్‌: ఈ నెల 26న (బుధవారం) చంద్ర గ్రహణం. ఆ సమయంలో చంద్రుడు ఎర్రటి రంగులో కనిపించనున్నాడు. అయితే, గ్రహణం భారతదేశంలో కనిపించదని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం లేదని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. బుధవారం విశాఖ నక్షత్రం, వైశాఖ పౌర్ణమి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం కనబడకపోవడం వల్ల ఎలాంటి గ్రహణ విధులు పాటించాల్సిన అవసరం లేదు. ఆలయాలు యథావిధిగా కొనసాగించవచ్చు. వైశాఖ పౌర్ణమి ఉత్సవాలు, పూజలు యథాతథంగా కొనసాగించుకోవచ్చు. బుధవారం సంపూర్ణ చంద్రగ్రహణం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారత్‌లోని తూర్పు ఈశాన్య ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. గ్రహణం కనిపించే దేశాల్లో సనాతన ధర్మాన్నిపాటించేవారు అక్కడ గ్రహణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ఆచరించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం ఏర్పడకపోవడం వల్ల ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని