తిథిప్రత్యేకం

Updated : 31/10/2019 21:01 IST
తిరుమల బ్రహ్మోత్సవాలు

తిరుమల బ్రహ్మోత్సవాలు
సెప్టెంబ‌ర్ 30 - అక్టోబరు 8 

కలియుగ వైకుంఠం తిరుమలలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు  సెప్టెంబ‌ర్ 30 నుంచి అక్టోబరు 8 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా జరిపిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. మలయప్పస్వామివారు స్వయంగా భక్తులను ఆశీర్వదించేందుకు ఆలయం వెలుపలకి రావడం విశేషం. బ్రహ్మోత్సవాలకు ఎంతో చరిత్ర వుంది. వందల ఏళ్లుగా ఈ ఉత్సవాలు జ‌రుగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను స్వామి అనుంగు భక్తుడైన అన్నమయ్య ఈ విధంగా వర్ణించాడు.

‘‘ వీధుల వీధుల విభుడేగీ నిదె మోదము తోడుతో మ్రొక్కరో జనులు’’
తిరువీధుల విహరించే స్వామివారిని కనులారా చూచి నమస్కరించమని దీనర్థం. స్వామి ఉత్సవానికి ముందు సేనాని విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరించి కోట్లాది దేవతలను ఈ వేడుక‌కు ఆహ్వానిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారు వివిధ వాహనాలపై విహరిస్తారు. స్వామి అనుంగువాహనమైన గరుత్మంతునిపై వూరేగే రోజున తిరుమల జన సముద్రాన్ని తలపిస్తుంది. ఈ ఉత్సవాల్లో ఒక రోజు రథోత్సవం, మరో రోజు స్వర్ణరథం వుంటుంది. చివరి రోజున చక్రస్నానంతో బ్రహ్మాండ ఉత్సవం ముగుస్తుంది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని