గురుముఖం

Updated : 31/10/2019 21:09 IST
వధూవరులకు అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు

వివాహం జరిగిన అనంతరం వధూవరులను ఇంటి బయట (వివాహ వేదికకు) తూర్పునకుగానీ, ఉత్తరానికి గానీ తీసుకొని వెళ్లి మొదట ధ్రువ నక్షత్రాన్ని, తరువాత అరుంధతీ నక్షత్రాన్ని వారికి చూపిస్తారు. ధ్రువ నక్షత్రంలా దంపతులిద్దరు నిలకడ మనస్తత్వాలతో స్థిరంగా ఉండాలని, అలాగే వధువు అరుంధతిలాగా మహాపతివ్రతలా మనుగడ సాగించాలనే ఆకాంక్ష ఈ ప్రక్రియలో కనిపిస్తుంది. 

ధ్రువ నక్షత్ర దర్శనం చేసే సమయంలో ఈ మంత్రం చెప్పాలి.

ధ్రువ క్షితిః ధ్రువ యోనిః ధ్రువమపి
ధ్రువతః స్థిరం త్వం నక్షత్రాణాం
మేధ్యసి సమాపాహి పృతన్యతః

ఈ భూమికి కేంద్రం ధ్రువము, ఈ ఉత్పత్తి స్థానం ధ్రువము, నీవు ధ్రువము, ధ్రువముగా ఉందువు, నక్షత్రముల సమూహమున ధ్రువత్వము పొంది వర్థిల్లాలి అని అర్థం.

అరుంధతీ నక్షత్ర దర్శనం చేసే సమయంలో ఈ మంత్రం జపించాలి.

సప్తర్షయః ప్రథమా కృత్తికా
నాం అరుంధతీం యత్‌ ధ్రువతాం
హనిన్యుః షట్కృత్తికా ముఖ్య
యోగ మహంతీ యం అస్మాకం ఏత త్వష్టమీ.

సప్తరుషులు కృత్తికలలో మొదటగా ఈమెను పిలవడం వలన మిగిలిన ఆరు కృత్తికలకు ముఖ్యమైన కలయికను ఈమె నడిపిస్తుంది. మాకు ఈమె ఎనిమిదవది అని అర్థం.  

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని