గురుముఖం

Published : 09/04/2019 20:07 IST
శివుడు అర్థనారీశ్వరుడు ఎలా అయ్యాడు!

సృష్టి ఆదిలో నారాయణుని నాభికమలం నుంచి అవతరించిన చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మ ఆదేశానుసారం సృష్టి కార్యానికి పూనుకొని మహాత్ముల సహకారం అర్థించాడు. ‘ముందు స్త్రీ జాతిని సృష్టించు నీ కార్యం సఫలం అవుతుంది’ అన్న ఆకాశవాణి వాక్కు విని, బ్రహ్మ ఆ శక్తి తనకు కలగాలని తపస్సు చేయడం ప్రారంభించాడు. చాలాకాలం తర్వాత పరమేశ్వరుడు అర్థనారీశ్వరుడి రూపంలో బ్రహ్మముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ మనోగతం తెలుసుకొని, తన శరీరంలోని అర్థభాగంలో అమరిఉన్న పార్వతీదేవిని పరాశక్తిగా వేరుచేసి బ్రహ్మ సృష్టికి సహకరించమన్నాడు. ఆమె ‘అలాగే’ అని తన కనుబొమ్మల నుంచి తనతో సమానమైన కాంతిమతి అయిన ఒక నారీశక్తిని ప్రకాశింపజేసింది. ఆ పరాశక్తే బ్రహ్మదేవుని సృష్టి కార్యాన్ని అవిఘ్నంగా జరిగేలా చేసింది. సృష్టి తర్వాత, ఆమె తిరిగి పరమేశ్వరుని శరీరంలో ప్రవేశించి, అర్థనారీశ్వరి అయింది. ఆనాటి నుంచి శివుడు అర్థనారీశ్వరుడు అయ్యాడు. కాళిదాసు మహాకవి పార్వతీపరమేశ్వరులను ఇలా స్తుతించడానికి కారణం శివుడి అర్థనారీశ్వరతత్వమే!

వాగర్థా వివసంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే!
జగతః పితరౌవందే, పార్వతీ పరమేశ్వరౌ!!

మనందరిలోనూ అర్థనారీశ్వర స్వభావం ఉంటుందని తెలుసుకోవాలి అని అర్థం.
 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని