గురుముఖం

Published : 07/04/2019 16:27 IST
ఎన్నో జంతువులు ఉండగా ప్రత్యేకించి గోవునే ఎందుకు పూజిస్తారు

మన భారతీయ సంప్రదాయంలో గోవుకు అతి పవిత్ర స్థానం ఉంది. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు.. అన్నీ గోవుకు పూజార్హతను కల్పించాయి. గోమాత కామధేనువు వంటిది. గోవు సర్వదేవతా స్వరూపం. గోదర్శనం సర్వ పాపహరణం. మహాభారతం  అనుశాసన పర్వంలో ఇలా ఉంది.

గోవో లక్ష్మాః సదామూలం గోష్ఠు పాప్మాన విద్యతే
అన్నమేవ సదా గావో వేవానాం పరమం హవిః
నివస్థిత గోకులం యత్ర శ్వాస ముచ్చాతు నిర్భయం
విరాజయతి తం దేహం పాపం చస్యప కర్షతి.

గోవులు లక్ష్మీ స్వరూపాలు. వాటిని దర్శిస్తే పాపాలు పటాపంచలు అవుతాయి. మనకు పోషక ఆహారాన్ని(పాలు, పెరుగు, నెయ్యి), దేవతలకు హవిస్సులను ఇస్తున్నాయి. ఆవులు ఎక్కడ నిర్భయంగా, ప్రశాంతంగా నిలబడి శ్వాస పీలుస్తాయో, ఆ ప్రాంతం పవిత్రమై, ఉన్నత స్థితిని పొందుతుంది. అక్కడ పాపం నిలబడలేదు. మన ఆర్ష సంస్కృతిలో గో పూజ, గో దానం, గో సేవ అతి ముఖ్యమైనవి. గోమయం (ఆవు పేడ) కూడా పవిత్రమైందే. శ్రీకృష్ణుడు, దిలీపుడు, విక్రమాదిత్యుడు, వశిష్ఠుడు లాంటివారు గోసేవ, గోరక్షణలో పేరుపొందారు. పూర్వం గోసంపదనే నిజమైన ఐశ్వర్యంగా పరిగణించేవారు. గోవుకు హాని చేస్తే ధర్మానికి హాని చేసినట్టే..

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని