గురుముఖం

Updated : 25/06/2019 16:53 IST
పూజామందిరం ఏ దిశలో ఉండాలి?

ల్లు నిర్మించిన తీరును బట్టే అక్కడ నివసించేవారి భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంట్లోని ఆయా గదుల మాదిరిగానే పూజాగది విషయంలోనూ కొన్ని నిర్దిష్టమైన సూచనలు ఉన్నాయి. దీని ప్రకారం పూజామందిరాన్ని ఇంటిలో ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు, ఉత్తరదిక్కుల మధ్య ఉన్న ప్రాంతమే ఈశాన్యం. పూజ గది నిర్మాణానికి ఇదే అత్యుత్తమమైన స్థానం.

ఈ గదిలో ఉదయాన్నే సూర్యకిరణాలు ప్రసరించడం మూలంగా అక్కడ చేసే ధ్యానం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి. ఈ గదిలో పూజ చేసుకునేవారు తూర్పు లేదా ఉత్తర దిక్కులకు తిరిగి కూర్చోవడం మంచిది. అంటే దైవాన్ని పడమటివైపు కానీ.. దక్షిణం వైపు కానీ ఉండేలా అమర్చుకోవాలి. ఇంటివైశాల్యాన్ని బట్టి వీలు లేకపోతే అల్మరా వంటిది పెట్టుకోవచ్చు. అయితే కనీసం ఒక్క ప్రతిమ లేదా ఫొటో అయినా ఈశాన్య దిక్కున ఉంచుకోవాలి. ఇక పూజగదికి తప్పనిసరిగా గడప ఉండాలి. గంటలతో తలుపును ఏర్పాటుచేస్తే మంచిది. నైరుతి, ఆగ్నేయ మూలల్లో పూజగదులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. బెడ్‌రూంలోనూ పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోకూడదు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని