గురుముఖం

Updated : 07/02/2019 21:27 IST
గుడిలో గంటలు ఎందుకు మోగిస్తారు?

గంట మోగిస్తే వచ్చే శబ్దం మంగళకరమైనదని చెబుతారు. భగవంతుని దర్శనానికి ముందు మనసు లోపల, బయట కూడా మెలకువ, శ్రద్ధ పెంచుకోవడానికి గంట మోగిస్తాం.

‘ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసామ్‌ 
కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనామ్‌’

అంటే సద్గుణ దైవీ పరమైన శక్తులు నాలో ప్రవేశించుగాక! నా గృహంలోనూ, హృదయంలోనూ అసురీ శక్తులు వైదొలుగుగాక! అనే ప్రార్థన ఘంటారావంలో చేస్తాం. హారతి ఇచ్చే సమయంలో కూడా గంట మోగిస్తాం. భక్తుల ఏకాగ్రత చెదరగొట్టే శబ్దాల నుంచి ఘంటానాదం, మంగళవాయిద్యాల శ‌బ్దం బయటపడేస్తాయి.

 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని