గురుముఖం

Updated : 07/02/2019 21:31 IST
హనుమంతుడి ఒంటి నిండా సిందూరం ఎందుకు ఉంటుంది?

  సిందూరం అంటే మనం పెట్టుకునే కుంకుమ. హనుమంతుడు సిందూర ప్రియుడు కావడం వెనుక కథను ‘పరాశరసంహిత’ వర్ణించింది. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని అడిగాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పింది. ఈ బొట్టు రామయ్యకు చాలా ఇష్టమని చెప్పింది. దీంతో వెంటనే హనుమంతుడు సిందూరాన్ని ఒంటినిండా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండటం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. దీంతో ఆయన నూనెతో కలిపిన గంగ సిందూరాన్ని ఒంటినిండా పట్టించుకున్నాడట. ఈ అమాయకపు పని చేసిన ఆంజనేయుడ్ని చూసిన శ్రీరాముడు ‘ఈ రూపంతో నిన్ను ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడను’ అని అన్నాడట. అటువంటి భక్తులకు సమస్త దోషాలూ తొల‌గి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చాడు. అందుకే హనుమంతుడి ఒంటి నిండా సిందూరం పూసి ఉంటుంది. 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని