గురుముఖం

Updated : 25/06/2019 18:09 IST
శివుడిని నందికొమ్ముల మధ్య నుంచి ఎందుకు దర్శించాలి?

రమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు. అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సివుంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు.

Tags: nandhi

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని