☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 08/04/2021 05:29 IST
వావివరసలు మరిచాడు..  నేడు ఉరికి వేలాడాడు..

 చెల్లిపై అత్యాచారం కేసులో నిందితుడి బలవన్మరణం
 పెద్దలు సకాలంలో స్పందించకే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: పిల్లలు తప్పటడుగులు వేస్తే చూసి మురిసిపోయే తల్లిదండ్రులు.. వారు పెద్దయ్యాక ‘తప్పుటడుగులు’ వేస్తుంటే గుర్తించలేకపోవడం ఎంతటి పెను విషాదాలకు దారితీస్తోందో తెలియజెప్పే దారుణ ఉదంతమిది. ‘అమ్మా.. అన్నయ్య దారి తప్పాడు. తోడబుట్టిన నాతోనే గాడి తప్పి ప్రవర్తిస్తున్నాడ’ని కూతురు చెబితే ఆ తల్లి పట్టించుకోలేదు. ఏడ్చినా వినలేదు. ఈ బాధ నుంచి బయటపడేందుకు పెద్దమ్మ-పెదనాన్నల చెంతకు చేరితే అక్కడా వారి కొడుకు రూపంలో మరో కీచకుడు ఎదురయ్యాడు. చెబితే వారూ స్పందించలేదు. ఫలితంగా ఓ యువతి అనూహ్యమెన వంచనకు.. సోదరుల చేతిలోనే లైంగిక దాడికి గురైంది. ఏళ్లపాటు నరకయాతన అనుభవించింది. చివరకు ధైర్యం తెచ్చుకుని పోలీసు ఠాణా మెట్లు ఎక్కడంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన సోదరుల్లో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 ఇదీ కేసు నేపథ్యం..
తన సోదరులే కామాంధులై తన జీవితాన్ని నాశనం చేశారంటూ మంగళవారం ఓ 20 ఏళ్ల యువతి కొత్తగూడెం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు రావడం కలకలం రేపింది. ఆమె తగిన ఆధారాలను సైతం సమర్పించింది. తండ్రి లేని తనపై సొంత అన్నయ్య చిన్నతనం నుంచీ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని పేర్కొంది. ఎన్నిసార్లు చెప్పినా తల్లి పట్టించుకోవడంలేదని పేర్కొంది. ఈ బాధలు భరించలేక ఇంటర్‌ చదివే సమయంలో పెద్దమ్మ-పెదనాన్నల పంచన చేరితే అక్కడా సోదరుడి వరసయ్యే వాళ్ల కొడుకు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొంది.  
లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ కొలువు..
బాధితురాలి పెదనాన్న సింగరేణిలో విశ్రాంత ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్నవాడు (27) బీటెక్‌ చేసి లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో ఒకసారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్లాడు. రెండువారాల క్రితమే మళ్లీ ఇక్కడికి వచ్చాడు. ఈ నేపథ్యంలో బాధిత యువతి ఫిర్యాదు గురించి తెలిసిన అతడు బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చేసిన తప్పు బయటపడుతుందని భయపడ్డాడా! లేక పశ్చాత్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే విషయంలో స్పష్టత లేదు. తన చెల్లెలితో (బాధితురాలు) ఫోన్‌లో మాట్లాడిన సంభాషణల్లో మాత్రం ఈ విషయం బయటకు పొక్కితే ఆత్మహత్యకు పాల్పడతానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో నిందితుడైన బాధితురాలి సొంత అన్నను ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు వివరించారు.

Tags:

మరిన్ని

  • బాలికలపై లైంగిక దాడుల కేసుల్లో నిందితులకు కఠిన కారాగార శిక్ష బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితులకు కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం కోర్టులు తీర్పులిచ్చాయి. ఓ కేసులో గుంటూరు జిల్లా పోక్సో కోర్టు
  • ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మహిళల అపహరణ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లాలో ముగ్గురు మహిళలను గురువారం అర్ధరాత్రి కొంతమంది మావోయిస్టులు అపహరించారు. గంగలూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కంకనార్‌ గ్రామంలో
  • కుటుంబాన్ని వెంటాడిన కరోనా గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధి నారాయణపురానికి చెందిన ఇరికేపల్లి బీఈడీ కళాశాలల కరస్పాండెంట్‌ కోలా శ్రీనివాసరెడ్డి (50) కరోనాతో శుక్రవారం చనిపోయారు.
  • ఎన్నికల విధి వక్రించింది.. తనకు జ్వరం వస్తోందని ప్రాధేయపడినా ఆ ఉపాధ్యాయుడిని ఎన్నికల విధుల నుంచి తప్పించలేదు. కనీసం రిజర్వులో కూడా ఉంచకుండా అలాగే విధులు నిర్వహించాలంటూ ఆదేశాలు ఇచ్చారు.

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌
  • రివ్యూ: వకీల్‌ సాబ్‌
  • అలీబాబా.. అరడజను కష్టాలు
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు
  • దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి
  • పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.