నలుగురు విద్యార్థుల అరెస్టు
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ పీఆర్ డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్ భూతం విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. మూడో పట్టణ సీఐ శ్రీరామకోటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. బీకాం మొదటి సంవత్సరంలో చేరిన ఇద్దరు విద్యార్థులపై అదే కళాశాలలో ఎంకాం చదువుతున్న నలుగురు విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీంతో వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో బీకాం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. బాధ్యులైన నలుగురు ఎంకాం విద్యార్థులపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.