☰
గురువారం, ఏప్రిల్ 22, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 03/03/2021 06:44 IST
కాళ్లూచేతులూ పట్టి.. నేలపైకి విసిరికొట్టి..

మూడేళ్ల బాలుడి ఉసురు తీసిన పినతల్లి

చార్మినార్‌, న్యూస్‌టుడే: ఈర్ష్య వివేకాన్ని చంపేసింది. అసూయ మానవత్వాన్ని మింగేసింది. అమానుషత్వం ఓ ముక్కుపచ్చలారని పసిబాలుడి ఉసురు తీసింది. నిండా మూడేళ్లు నిండని బాలుడిని రెండో అంతస్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి విసిరేసిందో మహిళ. బాలుడి కాళ్లూ చేతులు పట్టుకుని, పక్కింటి వారు చూస్తుండగానే, వద్దువద్దని వారు వారిస్తుండగానే నిర్దయగా కిందికి తోసేసింది. తనకు పిల్లలు లేకపోవడం, బావ కుమారుడిని అందరూ ముద్దు చేయడాన్ని సహించలేని, భరించలేని ఆమె ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. గతంలోనూ ఆ పసివాడిని కరెంట్‌ షాక్‌తో చంపబోయింది. ఆ చిన్నారి సుకుమారపు చేతులను తలుపుల మధ్య ఇరికించడం వంటి వికృత చేష్టలకు పాల్పడింది. భవానీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు, బాధిత కుటుంబ సభ్యులు అందించిన వివరాలివి. హైదరాబాద్‌ పాతబస్తీలోని ఈదీబజార్‌ కుమార్‌వాడికి చెందిన మహ్మద్‌ ఎతేషాముద్దీన్‌ (32), సుజావుద్దీన్‌ (27)లు సోదరులు. ఒకే భవనంలో ఉంటున్నారు. ఎతేషాముద్దీన్‌కు అస్మాసిద్దికా (26)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. గతంలో వీరికి కుమార్తె జన్మించిన ఐదు రోజులకే చనిపోయింది. మూడేళ్ల క్రితం వీరికి నుమానుద్దీన్‌ (3) జన్మించాడు. బాలుడు ఒక్కడే కావడంతో అందరూ ప్రేమతో చూసుకునేవారు. ఏడాదిన్నర క్రితం సుజావుద్దీన్‌కు ఆయేషాబాను (24)తో వివాహమైంది. వీరికి సంతానం లేదు. తన భర్త కూడా బాలుడితో ప్రేమగా మెలగడంతో ఆయేషాబాను పిల్లాడిపై అసూయ పెంచుకుంది. గతంలో బాలుడిని చంపడానికి ప్రయత్నించినప్పుడు కుటుంబ సభ్యులు మందలించడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. పెద్దలు నచ్చజెెప్పడంతో కొన్ని రోజుల క్రితం తిరిగి వచ్చింది. మంగళవారం ఉదయం బాలుడిని భవనం రెండో అంతస్తుపైకి తీసుకెళ్లింది. బాలుడి చేతులు, కాళ్లు పట్టుకుని భవనంపై నుంచి కిందకు తోసేసింది. బాలుడికి తీవ్రగాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితురాలు ఆయేషాబానును పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:

మరిన్ని

  • 30 వేల కట్నం కోసం.. ముగ్గురి ప్రాణాలు బలి ఓ కుటుంబంలో కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు, మరో ఇంట్లో మనస్పర్థలు.. ఈ కారణాలతో ఇద్దరు తల్లులు, ముగ్గురు బోసినవ్వుల చిన్నారుల ప్రాణాలు గంగలో కలిసిపోయాయి. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరో మహిళ తన రెండేళ్ల కుమార్తెతో సహా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో దూకి ప్రాణాలు విడిచింది. శ్రీరామనవమి పండుగ రోజు ఈ ఘటనలు ఆయా గ్రామాల్లో తీరని విషాదం నింపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
  • బొల్లినేని శ్రీనివాసగాంధీకి రిమాండ్‌ హైదరాబాద్‌ జీఎస్టీ పూర్వ సూపరింటెండెంట్‌ బొల్లినేని శ్రీనివాసగాంధీకి సీబీఐ న్యాయస్థానం వచ్చే నెల 7వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.
  • మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావుపై సీబీఐ కేసు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)ను మోసగించారనే ఫిర్యాదుపై గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు,....
  • నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ అధికారులతో కొందరు కుమ్మక్కై నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు పొంది జిల్లా సహకార సంఘాల ద్వారా....
  • రూ.వెయ్యి కోట్ల కొకైన్‌ స్వాధీనం తమిళనాడు తూత్తుకుడి పోర్టుకు వచ్చిన ఓ నౌకలోని కంటైనర్‌లో 400 కిలోల కొకైన్‌ ఉండటాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ).....
  • వివాహానికి తీసుకెళ్లలేదని? మెదక్‌ జిల్లా పాపన్నపేట్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పావని(28)కి నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం లెఫ్ట్‌ పోచంపాడ్‌కు చెందిన సిద్దురాములుకు....

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ‘వీరూ భాయ్‌.. నా జీతం పెంచండి’
  • ‘మా అమ్మను కౌగిలించుకోవాలని ఉంది’
  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం
  • కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి
  • Corona: ఆక్సిజన్‌ అందక భార్య ఒడిలోనే..
  • 18 ఏళ్లు పైబడినవారికి.. 28 నుంచి రిజిస్ట్రేషన్‌
  • ఒంటిని పట్టి... మనసును మెలిపెట్టి!
  • ఆ నిర్ణయం బాధాకరం: ఈటల
  • పెళ్లి చూపులకు వెళ్లొస్తూ పరలోకాలకు..
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.