15 రోజుల ముందే హైదరాబాద్‌కు గుంటూరు శ్రీను
ఈనాడు, హైదరాబాద్: బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు, సోదరుల అపహరణ కేసులో కొత్త అంశం వెలుగుచూసింది. ఈ కిడ్నాప్‌నకు ముందు తాము మూడు సార్లు రెక్కీ నిర్వహించామని కస్టడీలో ఉన్న నిందితులు బోయ సంపత్‌కుమార్, మల్లికార్జున్‌రెడ్డి రెండో రోజు విచారణలో పోలీసులకు వివరించారు. కేసులో కీలక సూత్రధారి గుంటూరు శ్రీను తరచూ హైదరాబాద్‌కు రావటం ద్వారా తమకు పరిచయమని, అతను కిడ్నాప్‌నకు 15 రోజుల ముందు ఇక్కడకు వచ్చి వెళ్లినట్టు వారిద్దరు పేర్కొన్నారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ద్వారా గుంటూరు శ్రీను పరిచయమయ్యాడని, ఆమెతో మంతనాల అనంతరం తామిద్దరం హోటల్‌కు వెళ్లి మద్యం తాగేవారమని వారు పోలీసుల కస్టడీలో చెప్పారు.
నేడు మళ్లీ విచారణ
అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను గురువారం సెషన్స్ న్యాయస్థానం విచారించింది. కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు ఆమెకు బెయిల్ మంజూరు చేయవద్దని, బెయిలిస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అఖిలప్రియ పిటిషన్‌తోపాటు, పరారీలో ఉన్న నిందితులు భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్‌రెడ్డిల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.