☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 22/01/2021 06:56 IST
రూ.50 అప్పు... ప్రాణం తీసింది

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: రూ.50 అప్పు వివాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. మూడు జీవితాలను రోడ్డు పడేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్‌ఐ ఎ.రఘుపతిరావు తెలిపిన ప్రకారం... స్థానిక పాత బస్టాండ్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ బాజి(27) ఆటోనగర్‌ ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నారు. రాత్రిపూట శ్రీలక్ష్మీ మారుతి పాల ఉత్పత్తుల విక్రయ దుకాణంలో పనిచేస్తున్నారు. 15 రోజుల కిందట రాత్రి ఇదే ప్రాంతానికి చెందిన యువకుడు పల్లపు కోటివీరయ్య.. సిగరెట్లు, నీళ్లసీసా తీసుకుని, రూ.50 బిల్లును ఫోన్‌పే చేశాడు. నగదు తన ఖాతాకు రాలేదని దుకాణ యజమాని పెండ్లి వైకుంఠవాసు చెప్పగా... బదిలీ ప్రాసెస్‌లో ఉందని, ఒకవేళ రాకుంటే ఉదయం ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆ నగదు రాకపోవడం, కోటివీరయ్య చెల్లించకపోవడంతో నాలుగు రోజుల క్రితం కోటివీరయ్య తమ్ముడు నాగేశ్వరరావును దుకాణంలో పనిచేసే బాజి... రూ.50 ఇవ్వాలని అడిగాడు. మంగళవారమూ మరోసారి అతన్నే డబ్బులు అడగడంతో వాటినిచ్చి కోపంగా ఇంటికి వెళ్లాడు. బుధవారం రాత్రి కోటివీరయ్య దుకాణం వద్దకు వచ్చి తాను డబ్బులు ఇవ్వాల్సి ఉంటే తన తమ్ముడిని ఎందుకు అడిగారని వాసు, బాజిలను ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారి మధ్య రోడ్డుపై గొడవ జరిగింది. యజమానిని దుకాణంలోకి తీసుకొచ్చిన బాజి... బయట ఉన్న కోటివీరయ్య, నాగేశ్వరరావు, వారి స్నేహితుడు తిరుమల్లేశ్వరరావు అలియాస్‌ పప్పుతో మాట్లాడేందుకు వెళ్లాడు. అనూహ్యంగా వారితో జరిగిన ఘర్షణ కారణంగా దెబ్బలు తగిలి అతడు స్పృహతప్పి కింద పడిపోయాడు. వెంటనే బాజిని ప్రైవేట్‌ ఆసుపత్రికి అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. తన భర్త మృతికి పల్లపు కోటివీరయ్య, నాగేశ్వరరావు, తిరుమల్లేశ్వరరావు, పాల దుకాణం నిర్వాహకులు పెండ్లి వైకంఠవాసు, లక్ష్మీమారుతి, పండ్ల వ్యాపారి షేక్‌ మహబు అలియాస్‌ సుప్రీం కారణమని బాజి భార్య సైదాబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. బాజి మరణంతో అతని కొడుకులు అహిల్‌(3), అమీర్‌(1)లు అనాధలయ్యారు. భర్త లేకుండా పిల్లలతో ఎలా జీవించాలని సైదాబి రోదిస్తున్న తీరు చూపరుల హృదయాలను కలచివేసింది.

Tags:

మరిన్ని

  • దొంగ అనుకొని దాడి.. రైతు మృతి దొంగ అనే అనుమానంతో తీవ్రంగా కొట్టడంతో ఓ రైతు మృతిచెందాడు. కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి ఎస్సై ధనుంజయ, మృతుడి కుటుంబసభ్యులు అందించిన
  • బ్యారేజీలో ‘కత్తుల వేట’ హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్యకు నిందితులు ఉపయోగించిన కత్తుల కోసం పోలీసులు ఆదివారం పార్వతీ (సుందిళ్ల) బ్యారేజీలో గాలింపు చేపట్టారు. వాటిని బ్యారేజీలో ఎక్కడ విసిరేశారో తెలుసుకోడానికి
  • చిత్తూరు మాజీ మేయర్‌ భర్తపై హత్యాయత్నం కేసు చిత్తూరు నగరపాలక సంస్థ మాజీ మేయర్‌ కఠారి హేమలత భర్త, తెలుగుదేశం పార్టీ నగర కన్వీనర్‌ కఠారి ప్రవీణ్‌పై ఆదివారం రాత్రి రెండో పట్టణ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నగరంలోని కయినికట్టు వీధికి చెందిన
  • ఇద్దరు విద్యార్థులను బలిగొన్న ‘సెల్ఫీ’ తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం పరిధిలోని ఏలేరు కాలువలో పడి పిఠాపురానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. కొండమహంతి ఉమాదత్త శ్రీనివాసు(16), వేణుం శివరామ్‌తేజ(16) పిఠాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో
  • గాలికొడుతుండగా పేలిన టైరు: ఇద్దరు మృతి  విధి ఓ రెండు ప్రాణాలను ‘గాలి’లో కలిపేసింది. ట్రాక్టరు టైరుకు గాలి కొడుతుండగా హఠాత్తుగా ట్యూబ్‌ పేలిపోయి ఇద్దరు ప్రాణాలు తీసేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కొమనాపల్లి గ్రామంలో
  • అధికారుల వాహనాన్ని ఢీకొన్న ఇసుక మాఫియా కారు తమిళనాడుకు అక్రమంగా తరలుతున్న ఇసుక టిప్పర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎస్‌ఈబీ స్పెషల్‌స్క్వాడ్‌ వాహనాన్ని ఇసుక మాఫియా సిద్ధం చేసుకున్న పైలెట్‌ కారు ఢీకొంది. టిప్పర్‌ దొరక్కుండా ఉండేందుకు ఇసుక మాఫియా ఈ దారుణానికి
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం వివాహేతర సంబంధం పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరి ప్రాణాలను బలిగొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం.. ఏలూరు తంగెళ్లమూడికి  చెందిన కుసుమ నాగసాయి(30)కి 2014లో నిడదవోలు మండలం తాళ్లపాలేనికి చెందిన వ్యక్తితో

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • తల్లికాబోతున్న హీరోయిన్‌ రిచా
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
  • రాళ్లు రువ్వి.. వెంబడించి
  • అలా చేశాక జుట్టు ఊడుతుంది?
  • రేపటి సిరులు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.