పంజాగుట్ట: హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ర్యాగింగ్‌కి పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కొందరు విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేశారు. అతడి నుంచి తమను కాపాడాలంటూ ఓ విద్యార్థి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హోంమంత్రి మనవడు ఫరాన్ బంజారాహిల్స్ రోడ్ నం.3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాలలో మూడో ఏడాది చదువుతున్నాడు. ఫరాన్ తమను ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ అదే కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థి రియాన్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.