గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అలిగిన ‘నేస్తం’...కాలిన ‘మగ్గం’

హిందూపురం, న్యూస్‌టుడే: నేతన్నకు మగ్గమే సర్వస్వం. తనను కన్నవారికి, తాను కన్నవారికి, తన ప్రపంచానికి రంగులద్దే సహధర్మచారిణికిచ్చే స్థానాన్ని దానికీ ఇస్తాడు. పడుగు, పేకలతోనే జీవితాన్ని అల్లుకుంటాడు. అలాంటి కార్మికుడు ‘నేతన్న నేస్తం’ జాబితాలో పేరు లేదనే... విరక్తితో మగ్గానికే నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం  జిల్లా హిందూపురం మండలం బాలంపల్లికి చెందిన కె.కాళాచారి 11 ఏళ్లుగా మగ్గం నేస్తున్నారు. గుర్తింపు కార్డూ ఉంది. కరోనా కారణంగా కొంతకాలం ముడి సరకు దొరక్క మగ్గం కట్టేశారు. నేతన్న నేస్తం కోసం గ్రామంలో తయారు చేసిన జాబితాలో తన పేరున్నా... పైనుంచి మంజూరు రాలేదని, న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగారు. ఫలితం దక్కకపోవడంతో బుధవారం మగ్గాన్ని కాల్చేస్తూ సెల్ఫీ వీడియో తీశారు. అది గురువారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని