హైదరాబాద్: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దపూర్‌లో సోమవారం ఓ మహిళపై జరిగిన దాడి కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ చందనా దీప్తి మీడియాకు తెలిపారు. గడిపెద్దపూర్‌లో మహిళపై దాడికి ఆర్థిక కారణాలే కారణమని పేర్కొన్నారు. ప్రధాన అనుమానితుడు సౌదత్‌ను అదుపులోకి తీసుకున్నాం. డబ్బులు గురించి చర్చకు వెళ్లినప్పుడు వారిద్దరి మధ్య గొడవ జరిగిందని, పెట్రోల్‌లాంటి ద్రావణం ఆమెపై పోసి సాదత్ నిప్పంటించాడని ఎస్పీ పేర్కొన్నారు. నిందితునికి తగిన శిక్ష పడే విధంగా దర్యాప్తు సాగుతోంది అని చందనా దీప్తి అన్నారు.