☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 22/01/2021 11:17 IST
శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి

శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ కె.బి.శివకుమార్‌ ​తెలిపారు. మైనింగ్ కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలు ఓ ట్రక్కులో తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ పేలినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతులంతా బిహార్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు.

 

గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన శివమొగ్గతో పాటు పొరుగున ఉన్న దావణగెరె, చిక్‌మగళూరు జిల్లాల్లోనూ కలకలం రేపింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి పలు ఇళ్లలో కిటికీలు ధ్వంసమవ్వగా, రోడ్లకు బీటలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే తొలుత అందరూ భూకంపంగా భావించారు. తర్వాత పేలుడు జరిగిందని నిర్థరణకు వచ్చారు. ఘటనాస్థలంలో పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు గుర్తుపట్టలేని రీతిలో ఛిద్రమైపోయాయని సమాచారం. మృతుల శరీర భాగాలు దాదాపు 1.5 కి.మీ వరకు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావాల్సిన సహకారం అందిస్తోందని తెలిపారు.

ఇవీ చదవండి...

బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడులు: 28 మంది మృతి

నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి


Tags: Crime Newsక్రైమ్‌ న్యూస్‌Bomb Blastబాంబు పేలుడుKarnatakaకర్ణాటకShivamoggaశివమొగ్గ

మరిన్ని

  • షణ్ముఖ్‌ జశ్వంత్‌కు పోలీసుల నోటీసులు[05:41]
  • చితికిపోయిన ఆశలు[05:37]
  • రాళ్లు రువ్వి.. వెంబడించి[01:07]
  • హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు[01:17]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • అంబానీ ఇంటి వద్ద వాహనం మా పనే
  • రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత
  • అలా చేశాక జుట్టు ఊడుతుంది?
  • గాలికొడుతుండగా పేలిన టైరు: ఇద్దరు మృతి 
  • తల్లికాబోతున్న హీరోయిన్‌ రిచా
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.