శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గలో క్వారీలో గురువారం రాత్రి భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు శబ్దం దాదాపు 15-20 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ముందుజాగ్రత్తగా బాంబ్ స్క్వాడ్ బృందాలను రప్పించారు. గురువారం రాత్రి 10:20 గంటల సమయంలో ఈ భారీ పేలుడు చోటుచేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పేలుడు శబ్దం విని భయంతో స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ఈ పేలుడుకు పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలువురు స్థానికులు దెబ్బతిన్న తమ ఇళ్ల కిటికీల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి..
ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
అమెరికా మహిళలు: ఊదా రంగే ఎందుకు?