పశ్చిమబెంగాల్: కోల్‌కతా నగరంలోని స్ట్రాండ్ రోడ్డులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఓ బహుళ అంతస్థుల భవనంలోని 13వ అంతస్థులో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. సమాచారం అందుకున్న సీఎం మమతా బెనర్జీ ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.