విశాఖ: విదేశాలకు అక్రమంగా నిధుల తరలింపు కేసులో ఇద్దరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల పేరిట రూ.1500కోట్లు విదేశాలకు తరలించారనే ఆరోపణలపై దీపక్ అగర్వాల్, ఆయుష్ గోయల్‌ను అరెస్ట్ చేశారు. చైనా, సింగపూర్, హాంకాంగ్‌కు నిధులు మళ్లించినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. విశాఖ కోర్టు అనుమతితో దీపక్ అగర్వాల్‌ను ఈడీ మూడురోజుల కస్టడీకి తీసుకుంది. ఆయుష్ అగర్వాల్‌ను కూడా కస్టడీకి కోరింది.