గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

పోలీస్‌ స్టేషన్‌లోనే లంచం

రూ.1.2 లక్షలు తీసుకుంటూ అనిశాకు  చిక్కిన షాబాద్‌ సీఐ, ఏఎస్‌ఐ
ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో  రూ.16.4 లక్షలు స్వాధీనం

షాబాద్‌, న్యూస్‌టుడే: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఓ ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో నిర్వహించిన ఏసీబీ సోదాల్లో రూ.16.4 లక్షల నగదు పట్టుపడింది. విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా లభించినట్లు సమాచారం. భూ వివాదానికి సంబంధించి కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శంకరయ్య, ఏఎస్‌ఐ కె.రాజేందర్‌ ఠాణాలోనే రూ.1.2 లక్షల లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాబాద్‌ మండలం సోలిపేట్‌ గ్రామానికి చెందిన విజయ్‌మోహన్‌రెడ్డికి, అదే గ్రామానికి చెందిన ఆయన బంధువులకు మధ్య ఎనిమిదేళ్లుగా భూవివాదం(ఎనిమిదిన్నర ఎకరాలు) నడుస్తోంది. తనకు అగ్రిమెంట్‌ చేసి వేరే వాళ్లకు స్థలం విక్రయించడంతో విజయ్‌మోహన్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. మరోవైపు భూమి కొనుగోలు చేసిన వ్యక్తులు పొజిషన్‌ తీసుకునేందుకు ప్రయత్నించగా అభ్యంతరం తెలపడంతో గొడవలు జరిగాయి. దీంతో విజయ్‌మోహన్‌రెడ్డిపై షాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అడిగినంత ఇస్తే సీఐకి చెప్పి ఈ వివాదాన్ని పరిష్కరిస్తానంటూ ఏఎస్‌ఐ రాజేందర్‌ ఆయనతో బేరసారాలకు దిగాడు. రూ.1.2 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఇదే విషయాన్ని విజయ్‌మోహన్‌రెడ్డి ఏసీబీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం బాధితుడు గురువారం షాబాద్‌ ఠాణాకెళ్లి ఇన్‌స్పెక్టర్‌ శంకరయ్యను కలిశాడు. ఆయన సూచన మేరకు ఠాణా ఆవరణలో ఏఎస్‌ఐ రాజేందర్‌కు డబ్బులిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం స్టేషన్‌, నగరంలోని ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అరెస్టయిన వారిద్దరినీ అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తామని, సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

Tags: crimebribe

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని