గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రూ.700 కోట్ల బురిడీ కేసుపై త్వరలోనే స్పష్టత  

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో బ్యాంకులను బురిడీ కొట్టించి రూ.700 కోట్ల రుణాలు పొందిన  వ్యవహారంలో నమోదైన కేసులను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్‌  నయీం అస్మి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి సీబీఐకి కేసు బదిలీ కోసం లేఖ వెళ్లిందని  చెప్పారు.దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. బ్యాంకులను మోసపుచ్చిన అంశంపై గత ఏడాది మే,  అక్టోబరు నెలల్లో కాకినాడ, అనపర్తి, బిక్కవోలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 5 కేసులు, రాజానగరం పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో 8 కేసులు నమోదైన విషయం తెలిసిందే.

 ఆయా కేసుల్లో యాక్సిస్‌ బ్యాంకు, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు, కరూర్‌ వైశ్యా బ్యాంకు, డీసీసీబీ (గుంటూరు),  ఇన్ఫినిటీ బ్యాంకు (మహారాష్ట్ర)ల నుంచి రుణాలు పొందినట్లు అప్పట్లో గుర్తించారు. గోదాముల్లో వ్యవసాయ  ఉత్పత్తుల నిల్వలు చూపి రుణాలు తీసుకున్న వ్యాపారులు తరవాత ఆ నిల్వలను మాయం చేసినట్లు తేలింది.  కొందరు బ్యాంకు ఉద్యోగులు, గోదాములను పర్యవేక్షించే ప్రైవేటు ఏజెన్సీల ప్రతినిధులతో కుమ్మక్కై ఈ  వ్యవహారాన్ని నెరిపినట్లు పోలీసులు గుర్తించారు. ధాన్యం నిల్వలున్న చోట ఆ సరకును మాయం చేసి  ఊకబస్తాలతో నింపగా.. జీడిపిక్కలకు బదులు జీడితొక్కుతో బస్తాలు నింపారు. ఆయా బ్యాంకుల ప్రధాన  కార్యాలయాలు ముంబై, దిల్లీ తదితర ప్రాంతాల్లో ఉండటం.. గోదాముల నిర్వహణ యాజమాన్యాలు సైతం  వేర్వేరు ప్రాంతాల్లో ఉండడంతో కేసు దర్యాప్తు పరిధి పెరిగింది. దీంతో కేసును సీబీఐకి అప్పగించాలని  నిర్ణయించినట్లు ఎస్పీ తెలిపారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని