హైదరాబాద్: బోయిన్‌పల్లి అపహరణ కేసులో ప్రధాన నిందితురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరిగింది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ వ్యవహారంలో పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది. నిందితురాలికి బెయిల్ మంజూరు చేయొద్దని కౌంటర్‌లో పోలీసులు కోరారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా మంది పరారీలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అయితే విచారణకు సహకరిస్తామని.. ఆమె ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని అఖిలప్రియ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి..