గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

యూపీ గ్యాంగ్‌స్ట‌ర్‌: మ‌‌రో ఇద్ద‌రు అనుచ‌రుల ఎన్‌కౌంట‌ర్!

వ‌రుస ఎన్‌కౌంట‌ర్‌ల‌లో ముగ్గురు మృతి

ల‌ఖ్‌న‌వూ: యూపీ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్దూబే ప్ర‌ధాన అనుచ‌రుల ఎన్‌కౌంట‌ర్ ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌రో ఇద్ద‌రు ప్ర‌ధాన‌ అనుచ‌రులు వేరువేరు ఘ‌ట‌నల్లో జ‌రిగిన‌ ఎన్‌కౌంట‌ర్‌లో మృతిచెందారు. ఇప్ప‌టికే ప్ర‌ధాన అనుచ‌రుల్లో ఒక‌డైన అమ‌ర్ దూబే హ‌మీర్‌పూర్ జిల్లాలో బుధ‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వికాస్‌ దూబే స‌న్నిహితులు ముగ్గురు మృతిచెందిన‌ట్ల‌య్యింది.

వికాస్ దూబేకు ప్ర‌ధానఅనుచ‌రుల్లో ఒక‌డైన‌ ప్ర‌భాత్‌ను ఈ మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి హ‌‌రియాణా‌లోని ఫ‌రీదాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విచార‌ణ‌లో భాగంగా ఇత‌న్ని కాన్పూర్‌కు తీసుకువ‌చ్చేందుకు బుధ‌వారం రాత్రి ప్ర‌యాణ‌మయ్యారు. మార్గ‌మ‌ధ్యంలో కారు టైరు పంక్ఛ‌ర్ కావ‌డంతో అది మార్చే ప‌నిలో పోలీసులు నిమ‌గ్న‌మయ్యారు. ఇదే అదునుగా భావించిన దుండ‌గుడు త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించి పోలీసుల నుంచి తుపాకి లాక్కొని వారి‌పైనే కాల్పులు జ‌రిపాడు. ఆ స‌మయంలో పోలీసులు ఎదురుకాల్పులు జ‌ర‌ప‌డంతో అత‌నికి తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అత‌న్ని స్థానిక ప్ర‌భుత్వాసుప‌త్రికి తీసుకెళ్ల‌గా అప్ప‌టికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారని యూపీ పోలీసులు వెల్ల‌డించారు.

ల‌ఖ్‌న‌వూకు 220కి.మీ దూరంలో ఉన్న ఎతావా ప్రాంతంలో జ‌రిగిన ఎన్‌కౌంటర్‌లో వికాస్‌ మ‌రో ప్ర‌ధాన అనుచ‌రుడు మృతిచెందిన‌ట్లు యూపీ పోలీసులు వెల్ల‌డించారు. వికాస్‌దూబే ప్ర‌ధాన అనుచ‌రుల్లో ఒక‌డైన బౌవా దూబే అలియాస్ ప్ర‌వీణ్ మ‌ర‌ణించాడ‌ని తెలిపారు. ఇత‌నితో ఉన్న‌ మ‌రో ముగ్గురు మాత్రం త‌ప్పించుకున్నార‌ని.. మ‌ర‌ణించిన బౌవా దూబేపై రూ.50వేల రివార్డు కూడా ఉన్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే, 8మంది పోలీసులను కాల్చి చంపిన కిల్ల‌ర్ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్‌దూబేను గురువారం ఉద‌యం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అరెస్టు చేశారు. 

ఇవీ చ‌దవండి..
గ్యాంగ్‌స్ట‌ర్‌ వికాస్ దూబే అరెస్ట్ 
చిక్కిన‌ట్లే చిక్కి త‌ప్పించుకున్న వికాస్‌దూబే

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని