గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఆక్సిజన్‌ అందక నలుగురి మృతి

నిజామాబాద్‌(వైద్యం) : జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సకాలంలో ఆక్సిజన్‌ అందకపోవడంతో నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు కొవిడ్‌ బాధితులు కావడం గమనార్హం. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్ అయిపోవడంతో కొవిడ్‌ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు, సాధారణ వార్డులో ఒకరు మృతి చెందారు. వీరంతా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారే. ఈ విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకుని ధర్నా చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆక్సిజన్‌ అందక చనిపోలేదు: కలెక్టర్‌
ఆస్పత్రిలో నలుగురి మృతిపై జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి స్పందించారు. ఆక్సిజన్‌ అందక ఎవరూ చనిపోలేదని అన్నారు. కరోనాతో ముగ్గురు, అనారోగ్యంతో మరొకరు మృతి చెందినట్లు వెల్లడించారు. ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నామని, రోగుల ముందు ఆక్సిజన్‌ సిలిండర్లు మార్చడంతో అపోహ తలెత్తిందని వివరణ ఇచ్చారు. అలాంటి అపోహలను ఎవ్వరూ నమ్మవద్దని కోరారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని