శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కరోనా భయంతో ఆత్మహత్య, పరీక్షలో నెగిటివ్‌

మదురై: తనకు కరోనా సోకిందని సామాజిక మాథ్యమాల్లో ప్రచారం జరగడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పరీక్షలో అతడికి నెగటివ్ అని రావడం గమనార్హం. తమిళనాడులోని మదురైకి చెందిన 35 ఏళ్ల వ్యక్తి  కేరళలో కూలీగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు లేకపోవడంతో తన తల్లిని చూసేందుకు మదురై దగ్గర్లోని స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు, రాష్ట్ర వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. అతణ్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రభుత్వం నుంచి అంబులెన్స్‌ రావడం ఆలస్యం కావడంతో స్థానికులే ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి నుంచి నమూనాలు సేకరించి ఆస్పత్రి వర్గాలు ఇంటికి పంపాయి. అదే సమయంలో అతణ్ని ఆస్పత్రికి తరలిస్తున్న వీడియోలను స్థానికులు సామాజిక మాథ్యమాల్లో ఉంచారు. దీంతో తనకు చెడుగా ప్రచారం జరుగుతుండటంతో  తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సమయంలో స్థానికులు తనను దుర్భషలాడటం వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంసభ్యులు తెలిపారు. అతడి మృతదేహాన్ని మదురై, తిరుమంగళం మధ్యలో ఉన్న కప్పలూరు వద్ద రైలు పట్టాలపై గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు తమిళనాడులో 309 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది దిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మతపరమైన ప్రార్థనలకు హాజరయినవారు.  

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)