శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

మల్కాజిగిరిలో కానిస్టేబుల్‌పై దాడి

మల్కాజిగిరి: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గుంపులుగా రావొద్దని, ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణం చేయవద్దని చెప్పినందుకు ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మల్కాజిగిరి పరిధి మౌలాలీలోని ప్రశాంతినగర్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే ద్విచక్ర వాహనంపై యువకుడితో పాటు తల్లిదండ్రులు ప్రయాణిస్తున్నారు. గమనించిన ఓ కానిస్టేబుల్‌ వారిని ఆపి లాక్‌డౌన్‌ అమల్లో ఉందని.. ద్విచక్ర వాహనంపై ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదని వారించారు. దీంతో ఆ యువకుడితో పాటు అతడి తల్లి తీవ్ర ఆగ్రహానికి గురై కానిస్టేబుల్‌ చొక్కా పట్టుకుని దాడి చేశారు. అక్కడే ఉన్న మరికొంత పోలీసులు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఆ యువకుడిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

 

 

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)