☰
ఆదివారం, మార్చి 07, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 22/01/2021 13:49 IST
‘సీరమ్‌’ అగ్నిప్రమాదంలో ఐదుగురి మృతి  

పుణె: ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ)కు చెందిన కొత్త ప్లాంట్‌లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం విషాదం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిర్మాణంలో ఉన్న ఎస్‌ఈజెడ్‌- 3 భవనంలోని నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో పొగలు అలముకున్నాయి. దీంతో అక్కడి ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లను రంగంలోకి దించారు. దాదాపు రెండు గంటలుగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ వెల్లడించారు. 

మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం

ఈ ఘటనపై సీరమ్‌ సంస్థ అధినేత అదర్‌ పూనావాలా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. దీనిపై ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ఇప్పుడే కొన్ని బాధను కలిగించే అప్‌డేట్స్‌ వచ్చాయి. ఈ ఘటనలో దురదృష్టవశాత్తు కొంత ప్రాణనష్టం జరిగినట్టు తెలిసింది. చాలా బాధపడుతున్నాం. మృతుల కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

అక్కడే మరోసారి చెలరేగిన మంటలు
సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సాయంత్రం మరోసారి మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం చెలరేగిన మంటలు సాయంత్రానికి అదుపులోకి వచ్చాయనుకొనే లోపే మరోసారి మంటలు రావడం కలకలం రేపింది. తొలుత ప్రమాదం జరిగినచోటే మళ్లీ మంటలు చెలరేగడం గమనార్హం. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఘటనపై మోదీ, ఉద్ధవ్‌ దిగ్భ్రాంతి 
సీరం ఇన్‌స్టిట్యూట్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది మృతి చెందడం బాధాకరమన్నారు. గాయాలపాలైన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌లు విచారం వ్యక్తం చేశారు. 

కరోనాపై పోరులో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కొవిషీల్డ్‌ టీకాలను ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగిన భవనం.. కొవిషీల్డ్‌ టీకాలు తయారవుతున్న భవనానికి దూరంగా ఉంది. దీంతో వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదని సంస్థ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి..
సీరమ్‌ సంస్థలో భారీ అగ్నిప్రమాదం


Tags: Crime Newsక్రైం వార్తలుSerum Institute of indiaసీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాpuneపుణె5 dead  

మరిన్ని

  • కాణిపాకం వెళ్తూ ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల మృతి[17:10]
  • మహమూద్‌ అలీ మనవడిపై ర్యాగింగ్‌ కేసు[13:08]
  • జంగారెడ్డిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం[10:49]
  • నిర్బంధం.. ఆపై అత్యాచారం[07:46]
  • నా కుమారుడికి తండ్రి పేరేం చెప్పను..?[01:35]
  • డబ్బులేక, ఆస్పత్రి ముందే చిన్నారి మృతి[01:29]
  • విశాఖలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి [01:21]
  • తోడబుట్టిన వారినే తెగనరికాడు[10:27]
  • ఆ ఐదుగురిది ఆత్మహత్యా.. హత్యా?[09:30]
  • టీవీ కోసం బయల్దేరి.. ప్రాణాలు విడిచి[08:14]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
  • ఆఫర్‌ కోసం చిరు, పవన్‌లకు కాల్‌ చేశా: కోట
  • ఆ సినిమా ఫ్లాప్‌..నితిన్‌కి ముందే తెలుసు
  • బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
  • నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్‌ ఛైర్మన్‌ మృతి
  • వాళ్లను కొట్టి.. వాళ్లింటికి
  • ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
  • రెండో పెళ్లిపై మంచు మనోజ్‌ ట్వీట్‌
  • అంబానీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారిదే..!
  • వారసత్వం వదిలి వెళ్లాలనే: యాష్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.