close
Published : 01/03/2021 18:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయేంద్ర ప్రసాద్‌ కొత్త చిత్రం ‘సీత’

ఇంటర్నెట్‌ డెస్క్: ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథ, మాటలు అందించారు ప్రముఖ రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్‌. తాజాగా ఆయన ‘సీత: ది ఇంకార్నేషన్‌’ అనే చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. అలౌకిక్‌ దేశాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాని ఏ హ్యూమన్‌ బీయింగ్‌ స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. మనోజ్‌ ముంతాషీర్‌ సాహిత్య, సంభాషణలు సమకూరుస్తున్నారు. పూర్తిస్థాయి వీఎఫ్​ఎక్స్ సాంకేతికతో చిత్రాన్ని నిర్మించనున్నారు. తారాగణం గురించి చిత్ర నిర్మాణ సంస్థ ఇంకా ప్రకటించలేదు.

ఇప్పటి వరకు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని సీతని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు. విజయేంద్ర ప్రసాద్ తెలుగులో  ‘ఛత్రపతి’, ‘మగధీర’ ‘బాహుబలి’లాంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. ప్రస్తుతం తెలుగులో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, తమిళంలో ‘తలైవి’ చిత్రాలకు కథకుడిగా పనిచేస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో ‘బజరంగీ భాయిజాన్‌’, ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’వంటి సినిమాలకు కథలు అందించారు. అవి ఎంత గొప్ప విజయాన్ని సాధించాయో తెలిసిందే. 


1364963797543354369

ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని